6 గ్యారంటీలు అమలు చేయమంటే, లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటి? : కిషన్‌రెడ్డి - కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
Published : Feb 23, 2024, 1:08 PM IST
Kishan Reddy Fires on Congress : తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని అడుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని అడగడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ విజయ సంకల్ప సభలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
BJP Vijaya Sankalp Yatra 2024 : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గొర్రెల పంపిణీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, భారీ అవినీతికి పాల్పడినట్లు కాగ్ నివేదికలో వెల్లడైందని కిషన్‌రెడ్డి తెలిపారు. మోటార్ బైకులు, అంబులెన్సుల్లోనూ గొర్రెల రవాణా జరిగినట్లు వారు గుర్తించారని చెప్పారు. దేశంలో సుభిక్షమైన పాలన కొనసాగాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధింబోతుందని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు హరీశ్‌బాబు, పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.