మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు : కిషన్ రెడ్డి
Published : Feb 27, 2024, 7:19 PM IST
Kishan Reddy Fires On Congress : గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్లో బీజేపీ విజయ సంకల్ప యాత్ర జరిగింది. ఈ యాత్రలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొని, రోడ్ షో నిర్వహించారు. మన పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ కోసం మోదీని మరోసారి గెలిపించుకోవాలని కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. కాషాయ పార్టీకి 375 సీట్లు రావాలనే సంకల్పంతో ప్రజల వద్దకు వెళ్లాలని విజయ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రజలందరి మనసులో మోదీ మళ్లీ రావాలని ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవీనితి జరిగిందని ఆరోపించారు. సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్‌లో ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పనిచేశారని విమర్శించారు.
Kishan Reddy Fires On MIM : ఒక్క రూపాయి అవీనితి లేకుండా మోదీ పాలనను కొనసాగిస్తున్నారని కొనియాడారు. 5 వందల ఏళ్ల కలైన అయోధ్య రామాలయాన్ని మోదీ నిర్మించారన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17సీట్లు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మజ్లిస్ సీటు కూడా బీజేపీ గెలవాలని, అసదుద్దీన్‌ను పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. మజ్లిస్ పార్టీ ప్రజాసామ్యానికి, అభివృద్ధికి వ్యతిరేకంగా పని చేస్తోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.