నాగదేవత విగ్రహంపై నాగుపాము - వీడియో వైరల్ - King Cobra Pose on Nagadevata Idol - KING COBRA POSE ON NAGADEVATA IDOL
Published : Jul 30, 2024, 10:07 AM IST
|Updated : Jul 30, 2024, 11:17 AM IST
King Cobra Pose on Nagadevata Idol : మాములుగానే నాగుపాము పడగవిప్పితే చూడటాని కన్నులపండువగా ఉంటుంది. అలాంటిది నాగదేవత విగ్రహంపై ఉండి దర్శనమిస్తే ఎలా ఉంటుంది. అలాంటి ఆసక్తికర సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆవిష్కృతమైంది. శ్రీశంభులింగేశ్వర, అభయాంజనేయ స్వామి ఆలయాల ఆవరణలో నాగుపాము కనిపించింది. ఆలయాల సమీపంలోని మర్రిచెట్టు కింద ఉన్న నాగదేవత విగ్రహంపై పడగవిప్పి పది నిమిషాల పాటు కనువిందు చేసింది.
నాగుపాము నాగదేవత విగ్రహంపై ఉందన్న విషయాన్ని స్థానికులు వీడియో తీసి వాట్సాప్లో షేర్ చేశారు. దీంతో విషయం క్షణాల్లో ఊరంతా పకింది. నాగుపామును చూడటానికి ఊరిలోని జనం ఒక్కసారిగా తరలి వచ్చారు. ఈ దృష్యాన్ని చూసి భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. సంఘటనపై గ్రామస్థులు స్పందించారు. ఇలాంటి దృష్యాని ఇంతవరకూ చూడలేదని, ఇది తమ అదృష్టంగా భావిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఇలా నాగదేవత విగ్రహంపై నాగుపామే స్వయంగా ఉండటం అందర్ని ఆశ్చర్యపరిచిందన్నారు. విగ్రహంపైపడగవిప్పిన పామును స్థానికులు తమ ఫోన్లలో బందించారు. విషయం సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.