కిచెన్‌లోకి 12 అడుగుల కింగ్ కోబ్రా- తీవ్రంగా శ్రమించి పట్టుకున్న క్యాచర్- లైవ్ వీడియో - King Cobra In Kitchen - KING COBRA IN KITCHEN
Published : May 26, 2024, 12:25 PM IST
King Cobra In Kitchen at Karnataka : 12 అడుగుల కింగ్ కోబ్రా ఓ ఇంట్లోని వంటగదిలోకి ప్రవేశించి కలకలం సృష్టించింది. భయంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన కర్ణాటకలోని జరిగింది.
చిక్కమగళూరు జిల్లాలోని శెట్టికొప్ప గ్రామానికి చెందిన మంజూనాథ్ గౌడ, ఉదయం స్నానం చేయడానికి వెళ్లేందుకు ఇంటి వెనుక తలుపులు తెరిచాడు. ఇంతలో కింగ్ కోబ్రా లోపలికి ప్రవేశించి వంటగదిలోకి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే మంజునాథ్, స్నేక్ క్యాచర్ హరీంద్రకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్, దాదాపు గంటపాటు శ్రమించి కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం కోబ్రాను సురక్షితంగా అడవిలోకి వదిలిపెట్టాడు.
పాముతో కుక్క ఫైట్ - ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన 'డైసీ'
ఇటీవలే ఇంట్లోకి వచ్చిన పాముతో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది ఓ శునకం. తన యజమానిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.