ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సుబ్రహ్మణ్య షష్టి కావడి మహోత్సవం - ముమ్మిడివరంలో భక్తుల కోలాహలం - SUBRAHMANYA SHASHTI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 4:57 PM IST

Subrahmanya Shashti im mummidivaram : సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం పురస్కరించుకుని కోనసీమ జిల్లాలో కావడి మహోత్సవం కనుల పండువగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా కోలాహలం నెలకొంది. డా. బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని కావడి ప్రియుడైన సుబ్రహ్మణ్యస్వామికి ఘనంగా కావడి పూజా మహోత్సవం భక్తులు నిర్వహించారు. తమ కోర్కెలు సిద్ధించాలని కోరుతూ పాలు, తేనె, భస్మం, సర్ప కావడులు ధరించి పూజా మహోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కేరళకు చెందిన వాయిద్య బృందం కళాకారులు ఆకట్టుకోగా ముమ్మిడివరం పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు.

పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామి వారిని దర్శించుకుంటే మంచి దృష్టిని ప్రసాదించి, అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేస్తారని భక్తులు నమ్ముతారు.

ABOUT THE AUTHOR

...view details