తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రభాస్​-అమితాబ్​ మధ్య ఆ సీక్వెన్స్​ పెద్ద సవాల్​ : 'కల్కి' యాక్షన్ కొరియోగ్రాఫర్​ - Kalki choreographer King Soloman - KALKI CHOREOGRAPHER KING SOLOMAN

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 7:26 PM IST

Kalki 2898 AD Prabhas Amitab Action Sequence : బాలీవుడ్ బిగ్​బీ అమితాబచ్చన్  80 ఏళ్ల వయస్సులోనూ కల్కి చిత్రంలోని పోరాట సన్నివేశాలను ఎంతో చలాకీగా చేశారని ఆ చిత్ర యాక్షన్ కొరియోగ్రాఫర్ కింగ్​ సాల్మాన్ తెలిపారు. అన్ని విద్యలు తెలిసిన అశ్వాత్థామకు, సాంకేతిక విద్యలు తెలిసిన బైరవకు పోరాట సన్నివేశాలు సమకూర్చడం చాలా సవాల్​తో కూడుకున్న అంశంగా సాల్మాన్ పేర్కొన్నారు. కల్కి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న ఆదరణ పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసిన కింగ్ సాల్మాన్ ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. వైజయంతీ సంస్థలో కల్కి లాంటి భారీ చిత్రానికి పనిచేయడం తన అదృష్టంగా పేర్కొంటూ  చిత్రీకరణ అనుభవాలను పంచుకున్నారు. కాగా, కల్కి సినిమా విడుదలైన తొలి రోజు పాజిటివ్​ టాక్​తో భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 9 రోజుల్లో రూ.800కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమా చూసిన ప్రతిఒక్కరూ ప్రభాస్​ - అమితాబ్ యాక్షన్ సీక్వెన్స్​లకు ఫిదా అయిపోతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details