ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'టీచర్లకు బోధనేతర విధులు అప్పగించొద్దు'- ఏపీలో ఘటనను ఉదహరించిన తమిళనాడు హైకోర్టు - Justice Battu Devanand Advise

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 8:17 AM IST

Justice Battu Devanand Advises to Tamilnadu Govt : ఉపాధ్యాయ వృతి గౌరవప్రదమైందని వారికి బోధన విధులు తప్ప ఇతర పనులను అప్పగించడం సరికాదని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ పేర్కొన్నారు. పాఠశాలల్లో ల్యాప్‌టాప్‌లను సురక్షితంగా భద్రపరిచేందుకు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమిళనాడు ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్‌లు చోరీకి గురయ్యాయన్న కారణంతో ప్రధాన ఉపాధ్యాయులను బలి పశువుల్ని చేయడం తగదన్నారు.

Non-Teaching Duties to Teachers not Assign : ల్యాప్‌టాప్‌ చోరీ కేసుల వాకబు కోసం తరచూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం గురువుల బాధ్యత కాదంటూ జస్టిస్​ బట్టు దేవానంద్​ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచిన సంగతిని ప్రస్తావించారు. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాల వద్ద జన సముహాన్ని నియంత్రించేందుకు ఉపాధ్యాయులను వినియోగించడం వారు గౌరవంగా, హుందాతనంగా జీవించేందుకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించటమేనని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తన తీర్పులో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details