ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: పవన్​ సమక్షంలో జనసేనలోకి బాలినేని, కిలారి రోశయ్య, ఉదయభాను - ప్రత్యక్ష ప్రసారం - JOININGS TO Janasena - JOININGS TO JANASENA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 5:32 PM IST

Updated : Sep 26, 2024, 5:41 PM IST

Joinings to Janasena: జగన్‌కు గుడ్‌బై చెప్తున్న వైఎస్సార్సీ నేతలు ఒక్కొక్కరుగా పవన్‌కు జైకొడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను బాటలోనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన అవనపు విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్‌బాబు, రత్నభారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా మరికాసేపటిలో జనసేనలో చేరనున్నారు. ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​ సమక్షంలో మంగళగిరిలో జనసేన కండువా కప్పుకోనున్నారు. అదే విధంగా రోశయ్య వియ్యంకుడు, ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి ఇప్పటికే ముగ్గురు నేతలు చేరుకున్నారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. పార్టీ కార్యాలయం నిర్మాణ పనుల కారణంగా, ఒక్కో నాయకుని వెంట లోపలకు నలుగురికే అనుమతించారు. నేతలకు జనసేన కండువాని పవన్ కల్యాణ్​ కప్పనున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Sep 26, 2024, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details