LIVE : తిరుపతి తొక్కిసలాట ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన - ప్రత్యక్షప్రసారం - CM CHANDRABABU IN HOSPITAL LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 11 hours ago
|Updated : 6 hours ago
CM Chandrababu in Hospital Live : వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. అస్వస్థతకు గురైన బాధితులకు అందుతున్న వైద్యచికిత్సపై అధికారులతో సీఎం మాట్లాడారు. జిల్లా కలెక్టర్, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.మరోవైపు సీఎం చంద్రబాబు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. తిరుపతిలో జరిగిన తోపులాట ఘటనలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. తోపులాట ఘటనల్లో ఆరుగురు చనిపోయినట్లు తెలిపారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం మాట్లాడారు. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ మేరకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆస్పత్రి వద్ద క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : 6 hours ago