తెలంగాణ

telangana

ETV Bharat / videos

భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవడమేన్న- జేఈఈ ర్యాంకర్లతో ఈటీవీ భారత్​ ముఖాముఖి - JEE Mains Rankers Interview

By ETV Bharat Telangana Team

Published : Apr 30, 2024, 10:31 PM IST

JEE Mains Rankers Interview : బాగా చదువుకోవాలి. భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకోవాలి అనేది ఆ యువకుల చిన్ననాటి కల. అందుకోసం అహర్నిశలు శ్రమించారు. కుటుంబ సభ్యుల సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఇటీవల వెలువడిన జేఈఈ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపిస్తున్నారు. జేఈఈ ఫలితాల్లో ఆల్​ ఇండియా 7వ ర్యాంకు సాధించిన పల్నాడు ప్రాంతానికి చెందిన సాయితేజ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సోదరుల సలహాలు, ఉపాధ్యాయుల సూచనలతో ర్యాంకును సాధించాడు. 

జేఈఈకి సన్నద్ధమవుతున్న సమయంలో కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిందని ఈటీవీ భారత్​కు తెలిపారు. జహీరాబాద్​కు చెందిన విదిత్​ ఐఐటీ బాంబేలో చదవటమే తన లక్ష్యమని చెబుతున్నాడు. సబ్జెట్​పై మంచి పట్టు ఉంటేనే మంచి ఫలితాలు సాధించగలమని చెప్పాడు. మరోవైపు జేఈఈ మెయిన్స్​లో 8వ ర్యాంకు సాధించిన విశాఖపట్టానికి చెందిన సతీశ్​ కుమార్​ సమయపాలన అవసరమని అన్నారు. సబ్జెట్​లలో ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుంటే విజయం సాధించినట్లేనని అన్నారు. ఐఐటీ బాంబేలో సీటు సంపాదించి భవిష్యత్తులో బంగారు బాటలు వేసుకోవడమే తమ లక్ష్యమంటున్న ఈ జేఈఈ ర్యాంకర్స్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details