ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బినామీ పేరుతో తర్లువాడ భూములు కొట్టేశారు - సీఎస్‌పై మూర్తియాదవ్​ ఆరోపణలు - Peethala Murthyadav - PEETHALA MURTHYADAV

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 7:43 PM IST

Janasena Corporator Peethala Murth Yadav Comments on CS : ఏపీ సీఎస్ జవహర్  రెడ్డిపై  జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు.  విశాఖ తుర్లువాడ భూములు బినామీ పేరుతో సీఎస్‌ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. నేరెళ్లవలసలో వంద ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. జవహర్‌రెడ్డి బినామీలు కాపులుప్పాడలో లేఔట్ వేసి భూములు అమ్ముతున్నారన్నారని పేర్కొన్నారు. సత్యకృష్ణంరాజు, శ్రీనివాసరాజు సీఎస్‌ బినామీలేనని రుజువు చేస్తానన్నారు. తర్లువాడ భూములు బినామీ పేరుతో సీఎస్‌ కొట్టేశారని మండిపడ్డారు. ఈసీ సర్టిఫికెట్ల కాపీ రాకుండా వెబ్‌సైట్ బ్లాక్ (website blocked) చేశారని మూర్తియాదవ్ మండిపడ్డారు. వెబ్‌సైట్ ఓపెనైతే 48 గంటల్లో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. 596 జీవో అడ్డుపెట్టుకొని భూములు కొట్టేశారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. సీఎస్‌ వెంటనే తప్పుకోవాలి లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.  త్వరలో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో సీఎస్ అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని పీతల మూర్తియాదవ్‌  హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details