తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 9:02 AM IST

Updated : Aug 16, 2024, 9:46 AM IST

ETV Bharat / videos

LIVE : శ్రీహరికోటలో SSLV-D3 ప్రయోగం - ప్రత్యక్షప్రసారం - ISRO SSLV D3 launch Live

ISRO to launch SSLV-D3 Live : భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ ఉదయం SSLV-D3 ప్రయోగం జరుగుతుందని ఇస్రో చైర్మన్ శ్రీధర పనికర్ సోమనాథ్ తెలిపారు. విపత్తులు, పర్యావరణం, అగ్నిపర్వతాలపై SSLV-D3 పర్యవేక్షణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 9.17 గం.కు నింగిలోకి ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 దూసుకెళ్లనున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీ హరికోటలోని స్పేస్ సెంటర్ స్కూల్‌లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వెల్లడించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా దళాల నుంచి శ్రీధర పనికర్ సోమనాథ్ గౌరవ వందనం స్వీకరించారు. 2047 నాటికి రాకెట్ ప్రయోగాల్లో వికసిత్ భారత్‌గా నిలవాల్సి ఉందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయ సాధన దిశగా అడుగులు వేయాల్సి ఉందని సోమనాథ్‌ అన్నారు. ప్రయోగాలు విజయవంతం కావడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ప్రతిభావంతులకు బహుమతులను ఆయన అందజేశారు. కాగా నేడు శ్రీహరికోటలోని షార్​లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3 ప్రయోగం ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated : Aug 16, 2024, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details