LIVE : షార్ నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ సి-60 - ప్రత్యక్షప్రసారం - PSLV C60 LIVE
Published : Dec 30, 2024, 10:02 PM IST
|Updated : Dec 30, 2024, 10:39 PM IST
PSLV C-60 launch Live : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని ప్రయోగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాత్రి 10 గంటల 15 సెకన్లకు PSLV సీ-60 ప్రయోగం చేపట్టింది. తొలుత సోమవారం రాత్రి 9:58 గంటలకు ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే అనంతరం స్పేడెక్స్ ప్రయోగ సమయంలో స్వల్ప మార్పు చేశారు. రాత్రి 9.58 గం.కు బదులుగా 10 గంటల 15 సెకన్లకు ప్రయోగించారు. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని, రాకెట్ వెళ్లాల్సిన అదే కక్ష్యలో ఇతర ఉపగ్రహాలు అనుసంధానం చెందడం వల్ల ఈ పరిస్థితికి దారితీసిందని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ వెల్లడించారు. దీంతో ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యం అయిందని అన్నారు. 9.58 గంటలకు బదులుగా 10 గంటల 15 సెకన్లకు రీషెడ్యూల్ చేశామని సోమ్‌నాథ్ తెలిపారు. పీఎస్‌ఎల్‌వీ-సీ60 ద్వారా ప్రధానంగా స్పేడెక్స్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుంది. పీఎస్ఎల్వీ సీ-60 స్పేడెక్స్ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Dec 30, 2024, 10:39 PM IST