తెలంగాణ

telangana

ETV Bharat / videos

రేపు ఘనంగా జగన్నాథ రథయాత్ర - హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి - Iskcon Jagannath Temple Rath Yatra - ISKCON JAGANNATH TEMPLE RATH YATRA

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 1:20 PM IST

Jagannath Temple Rath Yatra : హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజ్​మెంట్ కౌన్సిల్ మెంబర్ వేదాంత చైతన్యదాస్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఉదయం 11.30 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానిరి సీఎం రేవంత్ రెడ్డి, వివిధ రాష్ట్రాల ఇస్కాన్ ప్రతినిధులు హాజరు కానున్నట్లు వెల్లడించారు.

ఎన్టీఆర్ స్టేడియం నుంచి నారాయణగూడా, హిమాయత్​నగర్, టీటీడీ టెంపుల్, బషీర్​బాగ్, అబిడ్స్, ఎంజే మార్కెట్ కూడలి మీదుగా ఎగ్జిబిషన్ మైదానం వరకు యాత్ర సాగుతుందని వివరించారు. అక్కడ పండుగ వేడుకలు జరుగుతాయని తెలిపారు. వేడుకల్లో కచేరి, మహా హరతి, ప్రవచనాలు ఉంటాయని చెప్పారు. భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు 108 దేవాలయాల్లో భాగవతాధానం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో వేడుకలకు లక్షకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details