ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం - యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ - వీడియో చూశారా? - iPhone 16 Series Sales in India - IPHONE 16 SERIES SALES IN INDIA
Published : Sep 20, 2024, 12:48 PM IST
iPhone 16 Series Sales in India : ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం శుక్రవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ సాంకేతికత తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తిమంతంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు యాపిల్ స్టోర్ల ముందు క్యూ కట్టారు. శుక్రవారం తెల్లవారుజామున విక్రయాలు ప్రారంభం కాకముందు నుంచే స్టోర్లు ఎదుట లైన్లో నిలబడి మరీ నిరీక్షించారు. ముంబయి, దిల్లీ సహా దేశంలోని వేర్వేరు నగరాల్లోని యాపిల్ స్టోర్స్, పెద్ద మాల్స్ బయట జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. యాపిల్ స్టోర్ సిబ్బంది తలుపులు తీసి లోపలకు ఆహ్వానించగానే వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆనందంగా స్టోర్లలోకి వెళ్లి సరికొత్త మోడల్ ఐఫోన్‌లను కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 'యాపిల్ క్రేజ్' ఇలా ఉంటుందంటూ కామెంట్లు వస్తున్నాయి.