తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరంగల్‌లో గులాబీ గెలుపు ఖాయం - బీఆర్ఎస్‌ అభ్యర్థి సుధీర్‌ కుమార్‌ - BRS Warangal candidate Sudhir Kumar - BRS WARANGAL CANDIDATE SUDHIR KUMAR

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 10:31 PM IST

Interview with BRS Sudhir Kumar : తన పనతీరు, పార్టీపై విధేయతే వరంగల్ పార్లమెంటు స్ధానంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో నిలుపుతున్నాయని, సుధీర్ కుమార్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో వెనకడుగు వేయకుండా జైళ్లకు వెళ్లానని, పార్టీకి నమ్మకంగా కొనసాగుతున్న తనను అధిష్ఠానం గుర్తించిందని చెప్పారు. 

Lok Sabha Elections 2024 : హనుమకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్న సుధీర్ కుమార్‌ని, వరంగల్ పార్లమెంటు స్ధానంలో బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా కేసీఆర్ ఇవాళ ఖరారు చేశారు. సాయంత్రం సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సుధీర్ కుమార్‌కి ఫోన్ చేసి అభ్యర్ధిగా నిర్ణయించామని చెప్పారు. అందరి సహకారంతో, పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలని చెప్పారు. పార్టీ అభ్యర్ధిగా తనని ఎంపిక చేయడంపై కేసీఆర్‌కు సుధీర్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తనకెవరూ పోటీ కాదని, తన గెలుపు ఖాయమని వరంగల్ ప్రజలు చారిత్రాత్మక విజయం అందివ్వబోతున్నారంటు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి సుధీర్ కుమార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details