తెలంగాణ

telangana

ETV Bharat / videos

రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - Independence Day Celebrations 2024 - INDEPENDENCE DAY CELEBRATIONS 2024

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 12:47 PM IST

Independence Day Celebrations at Ramoji Film City : రామోజీ ఫిల్మ్‌సిటీలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 'ఈనాడు' మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్. కిరణ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ సీఈఓ బాపినీడు, రామోజీ గ్రూపు హెచ్​.ఆర్ ప్రెసిడెంట్‌ గోపాల్‌రావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డి.ఎన్.​ ప్రసాద్‌, ఆర్​ఎఫ్​సీ డైరెక్టర్‌ శివ రామకృష్ణ, ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌ సహా రామోజీ గ్రూపు సంస్థల్లోని వివిధ విభాగాల అధిపతులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రామోజీ గ్రూప్​కు చెందిన అన్ని కార్యాలయాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  

మరోవైపు దేశమంతటా మువ్వన్నెల రెపరెపలు కనిపించాయి. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలు, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు, ఊరువాడ అంతటా మువ్వన్నెల పండుగ సందడి కనిపించింది. 

ABOUT THE AUTHOR

...view details