భారీ సెట్టింగులతో ఆకట్టుకుంటున్న గణనాథుడు - చూసేందుకు తరలివస్తున్న భక్తులు - Impressive Takara Basti Gananadudu - IMPRESSIVE TAKARA BASTI GANANADUDU
Published : Sep 16, 2024, 3:31 PM IST
Attractive Takara Basthi Ganesha: సికింద్రాబాద్లోని టకార బస్తీలో అశోక్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడు, సెట్టింగులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆధ్వర్యంలో జరిగే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వానర సేన ద్వారా పాలకులుగా వేసిన సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. జితేంద్రుడు నాగాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛ పోగా, హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చే సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే షోలను మండపంలో పెట్టడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి చూస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణలతో కూడిన గణనాథుడికి నిత్యం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులను చేపట్టారు. పద్మారావు ఏటా బోనాల పండుగకు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా వెళ్లి పద్మారావు ఇంట్లో బోనాల పండుగ రోజు భోజనం చేసేవారు.