తెలంగాణ

telangana

ETV Bharat / videos

రూ.1.83 కోట్ల విలువైన అక్రమంగా తరలిస్తున్న మద్యం ధ్వంసం - police destroyed illegal liquor

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 8:34 PM IST

Police Destroyed Liquor with a Road Roller : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పరిధిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని శంషాబాద్​ ఎక్సైజ్​ పోలీసులు పట్టుకున్నారు. ఈ మద్యాన్ని రోడ్డు రోలర్​తో తొక్కించి ధ్వంసం చేశారు. దీని విలువు సుమారు రూ.1.83 కోట్లు ఉంటుందని ఎక్సైజ్​ అధికారి దశరథ్​ స్పష్టం చేశారు. దిల్లీ, గోవా, మధ్యప్రదేశ్​, హర్యానా, పశ్చిమ బంగాల్​ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. నగరంలోకి మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

మద్యంతో పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. తక్కువ ధరకు వస్తుందని కల్తీ మద్యం కొనుగోలు చేసి అనారోగ్యం పాలవద్దని సూచించారు. అందుకే కల్తీ మద్యాన్ని కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మధ్య నగరంలోకి అక్రమంగా మద్యాన్ని తీసుకెళుతూ చాలా మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో వారిని విచారించగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నట్లు తెలుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details