అక్రమ మైనింగ్‌తో పంటలు దెబ్బతింటున్నాయి - మా గోడు వినండి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 10:24 AM IST
Illeagal Mining in Kotturu Tadepalli: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్ గురించి రెవెన్యూ, మైనింగ్, నీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరికి వారు తగిన రీతిలో స్పందించకుండా చేతులెత్తేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా ఎలా మైనింగ్ చేస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావును రైతులు ప్రశ్నించారు. యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని కలెక్టర్‌కు వారు వినతిపత్రం అందజేశారు.
కొత్తూరు తాడేపల్లిలో అక్రమ మైనింగ్ సాగుతోందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. ఈ అక్రమ మైనింగ్ వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని కలెక్టర్ ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజులో వందలాది భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని సాక్ష్యాలతో సహా వివరించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని కలెక్టర్ ఎదుట మొర పెట్టుకున్నారు. అక్రమంగా మైనింగ్‌కు పాల్పడిన వాహనాలను అధికారులకు పట్టిస్తే, నామామాత్రపు పెనాల్టీలు విధిస్తున్నారని తెలిపారు. తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.