తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలంగాణకు తలమానికం ఐఐటీహెచ్‌ - ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చిన మోదీ - governer on IIT Hyderabad Campus

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 10:32 PM IST

IIT Hyderabad Campus Dedicated to the Nation by Modi : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్​గా జాతికి అంకితం చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి ప్రధాని మోదీ(Prime Minister Shri Narendra Modi) తెలంగాణ రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు వర్చువల్​గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. (I.I.T )హైదరాబాద్​లోని అభివృద్ధి ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేయగా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ తయారైన వెంటిలేటర్లు కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడాయని కొనియాడారు.

IIT Hyderabad Campus : నిజామాబాద్​లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించగా ఎంపీ ధర్మపురి అర్వింద్ , ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. మహబూబ్​ నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రధాన మంత్రి శిక్ష ఉచ్చతర్ అభియాన్ కార్యక్రమాన్ని జమ్ము నుంచే ప్రారంభించారు. ఇందుకోసం పాలమూరు యూనివర్శిటీకి కేంద్ర ప్రభుత్వం 100కోట్లు కేటాయించింది.

ABOUT THE AUTHOR

...view details