తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 3 hours ago

ETV Bharat / videos

LIVE : సచివాలయంలో రంగనాథ్​, దాన కిశోర్​ ప్రెస్​మీట్ - Ranganath and Dana Kishore live

Ranganath and Dana Kishore Press Meet : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువుల కాపాడడం కోసం హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా చెరువుల ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. శుక్రవారం మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలోకి వచ్చిన కట్టడాలకు సర్వే చేయడానికి అధికారులు వెళ్లారు. కూల్చేసే కట్టడాలకు రెడ్​ మార్క్​ను వేశారు. ఇప్పుడు మళ్లీ అధికారులు సర్వే చేయడానికి వెళితే స్థానికుల వ్యతిరేకించడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఇంటిని కూల్చేస్తారేమోననే భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ కూడా పూర్తి వివరణ ఇచ్చారు.మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుతోనే సరిపెట్టకుండా మహిళలకు రుణాలు, చిన్నారులను హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాసితులకు అన్నిరకాల తోడ్పాటును అందించిన తర్వాతే కూల్చివేతలను మొదలుపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో సచివాలయంలో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​, దాన కిశోర్​ మీడియా సమావేశం నిర్వహించారు.
Last Updated : 3 hours ago

ABOUT THE AUTHOR

...view details