రాముడిపై బాలుడి భక్తిభావం - 500 రుబిక్స్తో శ్రీరాముని నమూనా
Published : Jan 27, 2024, 5:01 PM IST
Hyderabad Boy Made Lord Sri Ram Portrait With Rubic Cubes : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పురస్కరించుకుని సికింద్రాబాద్‌కు చెందిన బాల కళాకారుడు 11ఏళ్ల హృదయ్ పటేల్ శ్రీరాముని పజిల్ (రుబిక్ క్యూబ్)ను రూపొందించాడు. శ్రీరాముని ప్రతిబింబం విశేషంగా ఆకట్టుకుంది. బేగంపేట రసూల్‌పురాలోని స్వామి నారాయణ దేవాలయంలో ప్రత్యేకంగా క్యూబ్స్‌తో ఏర్పాటు చేసిన శ్రీరాముడి చిత్రపట భక్తులకు కనువిందు చేసింది.
శ్రీరాముడిపై భక్తితో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ నేపథ్యాన్ని పురస్కరించుకొని శ్రీరాముని ఆకృతిని రూపొందించినట్లు హృదయ్ పటేల్ తెలిపాడు. ఐదు అడుగుల శ్రీరామ మూర్తి ఫ్రేమ్ తయారు చేయడానికి 500 క్యూబ్‌లు ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. తన గురువైన మానస సరోరాడ్, స్వామి నారాయణ ప్రతిబింబ ఆకృతులను కూడా తయారు చేసినట్టు వెల్లడించారు. భగవంతునిపై ఈ ఆలోచన విధానం, ఆధ్యాత్మిక భక్తి భావానికి తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధాన కారణమని బాల కళాకారుడు హృదయ్ అన్నారు.