కరెన్సీనోట్లతో గణపతికి ప్రత్యేక అలంకరణ - చూడటానికి రెండు కళ్లు చాలవు! - Currency Ganesh In Husnabad
Published : Sep 13, 2024, 7:35 PM IST
Ganesh Idol Decorated With Currency Notes : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొలువైన గణనాథుడి మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'కరెన్సీ గణేశ్' ప్రత్యేక పూజలందుకుంటున్నారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి లక్ష్మీ గణపతి పూజ నిర్వహించి రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ఇందుకోసం రూ.500, 200,100,10 రూపాయల నోట్లను వినియోగించారు.
మండపాన్ని కూడా కరెన్సీ నోట్లతో అలంకరించడంతో 'కరెన్సీ గణేశుడిగా' భక్తులకు దర్శనమిస్తున్నారు. కాయిన్లతో రూపుదిద్దుకున్న గణపతి నమూనా అందరినీ అకట్టుకుంటోంది. దీంతో విఘ్నాధిపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆసక్తిగా తిలకిస్తున్నారు. హుస్నాబాద్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇప్పటికే పలుచోట్ల గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పర్యావరణ హితం కోరుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మట్టివినాయకులను పంపిణీ చేశాయి. వినాయక వేడుకల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.