తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఉడుమును తరుముతూ ఇంట్లోకి 11 అడుగుల కింగ్​ కోబ్రా- ఆ తర్వాత ఏమైందంటే? లైవ్​ వీడియో! - Huge King Cobra Rescue In Odisha - HUGE KING COBRA RESCUE IN ODISHA

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2024, 3:33 PM IST

Huge King Cobra Rescue In Odisha : ఒడిశా మయూర్​భంజ్​ జిల్లా బంగ్రా గ్రామంలో 11 అడుగుల భారీ నాగుపాము సోమవారం కలకలం సృష్టించింది. గ్రామంలోని ఓ ఇంట్లో 6.7 కిలోలు బరువున్న నాగును చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న దుల్కా వైల్డ్​లైఫ్​ రేంజ్​ అటవీ శాఖ సిబ్బంది, పామును పట్టుకున్నారు. నాగును స్థానిక వెటర్నరీ వైద్యుడు పరిశీలించిన తర్వాత సురక్షిత ప్రాంతంలో మంగళవారం విడిచిపెట్టారు. కాగా, పామును సురక్షితంగా పట్టుకున్నట్లు స్నేక్​ క్యాచర్​​ తెలిపారు. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందని చెప్పాడు.

పాముతో కుక్క ఫైట్ - ప్రాణాలకు తెగించి యజమానిని కాపాడిన 'డైసీ'
ఇటీవలే ఇంట్లోకి వచ్చిన పాముతో తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడింది ఓ శునకం. తన యజమానిని పెను ప్రమాదం నుంచి తప్పించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details