8 రోజులుగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత - భక్తులకు తప్పని ఇబ్బందులు - Huge Flood Water At Edupayala - HUGE FLOOD WATER AT EDUPAYALA
Published : Sep 8, 2024, 9:48 AM IST
Huge Flood Water At Edupayala Durga Bhavani Temple : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం 8 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు నుంచి ఎగువకు భారీ వర్షాలు కురవడంతో వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. గర్భగుడి ముందున్న నదీపాయ ఆలయ మండపానికి ఉన్న రేకులను ఆనుకొని గర్భగుడి నుంచి అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి తెల్లవారుజామున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.
వరద ఉద్ధృతి తగ్గగానే యధావిధిగా మూల విరాట్, అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. వనదుర్గ ఆనకట్ట నిండడంతో రెండు పంటలు పండుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని జాలరులు చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు. వనదుర్గ ప్రాజెక్ట్, గర్భగుడి వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీగేట్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.