అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం - కూల్చివేస్తున్న పరిమితులు లేని భవనాలు - Illegal Houses Demolition Hyderabad - ILLEGAL HOUSES DEMOLITION HYDERABAD
Published : May 25, 2024, 3:24 PM IST
HMDA Illegal Houses Demolition in Manikonda : హైదరాబాద్ నగర శివారులో అక్రమంగా నిర్మించిన భవనాలపై హెచ్ఎండీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగులను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని మణికొండ మున్సిపల్ పరిధిలో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతుందని, కొంత మంది బిల్డర్లు మాఫియాగా తయారై అనుమతులు లేకుండా బిల్డింగులు నిర్మిస్తున్నారని గ్రహించిన హెచ్ఎండీఏ అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 35 అక్రమ నిర్మాణాలను గుర్తించామని అందులో 5 భవనాల స్లాబ్లను కూల్చి వేశామని పేర్కొన్నారు.
HMDA Collapsed Illegal Houses : తాజాగా గండిపేట్ మండలంలోని పంచవటి కాలనీలో ఓ భవనం అనుమతి లేకుండా నిర్మించారని అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమతులు ప్రకారం నిర్మాణాలు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ హెచ్చరించారు. ఎక్కువగా పెంట్ హౌస్లు నిర్మిస్తున్నారని తెలియజేశారు. ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తామని అన్నారు.