ఘన్పూర్ పెద్ద చెరువు కట్టకు భారీ గండి - 100 ఎకరాల్లో నీటమునిగిన వరి పొలాలు - Heavy Rains In Medak
Published : Sep 2, 2024, 2:17 PM IST
Heavy Rains In Medak : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో పెద్ద చెరువు కట్టకు భారీ గండి పడింది. చెరువుకు గండి పడటంతో చెరువులోని నీరు వృథాగా పోతుంది. చెరువు కింద ఉన్న 100 ఎకరాల వరి పొలాలు నీటిలో మునిగిపోయాయి. పొలాలు నీటిలో మునిగి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి.
మెదక్ జిల్లాలో ఈ వానా కాలంలో ఇప్పటి వరకు 549 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 707.03 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 29 శాతం అధికంగా వర్షం కురిసింది. మాసాయిపేట మండలంలో సాధారణం కంటే 60 శాతం అధికంగా, 14 మండలాల్లో 20 నుంచి 59 శాతం అధికంగా వర్షం కురిసింది. మరో 6 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.