తెలంగాణ

telangana

నాగార్జునసాగర్​కు భారీ వరద - శ్రీశైలం 10 గేట్ల ద్వారా నీటి ప్రవాహం - Huge Flow To nagarjuna Sagar Dam

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 1:40 PM IST

Heavy Flood Flow To Nagarjuna Sagar Project (ETV Bharat)

Heavy Flood Flow To Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ జలాశయానికి భారీ వరద పోటెత్తుతోంది. గత మూడో రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తోంది. మంగళవారం రోజున 10 గేట్ల ద్వారా నీరు విడుదల చేయడంతో సాగర్​కు వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 524.40 అడుగులకు చేరింది. జలాశయం మొత్తం నీటి నిలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిసామర్థ్యం 157.42 టీఎంసీల వద్ద నీరు ఉంది.

నాగార్జున సాగర్​కు ఎగువ నుంచి ఇన్​ఫ్లో 2 లక్షల 67వేల 684 క్యూసెక్కులు వస్తోంది. సాగర్​ నుంచి కుడి కాల్వకు 6వేల ఆరు క్యూసెక్కులు నీరు, ఎస్​ఎల్బీసీకి తాగునీటి 900 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​ జలాశయం నీరు ప్రవాహం పెరుగుతుండడంతో ఎడుమ కాలువ కింద రైతన్నలు సాగుకు సిద్ధం అవుతున్నారు. కాగా సాగు నీటి విడుదలపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details