భూ సమస్య పరిష్కరించాలంటూ సెల్‌టవర్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం - Farmer Attempted Suicide From Tower - FARMER ATTEMPTED SUICIDE FROM TOWER
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2024, 4:25 PM IST
Farmer Attempted Suicide From Cell Tower in Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లికి చెందిన బొజ్జ గట్టు పొన్నాలకు అతని సోదరులకు మధ్య భూ సమస్య ఉంది. ఈ నేపథ్యంలో భూ సమస్యను అధికారులు పరిష్కరించి న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పడంతో రైతు సెల్ టవర్ దిగారు.
రైతుపై చట్టరీత్యా చర్యలు : ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పొన్నాలకు తన సోదరులకు భూ విషయంలో సమస్య ఉందన్నారు. గొడవ జరిగిన విషయంలో తహసీల్దార్ ఎదుట ఇద్దరినీ బైండోవర్ నిర్వహించినట్లు చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడతానని సెల్ టవర్ ఎక్కినందుకు పొన్నాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పొన్నాల భూ సమస్య పరిష్కరించేందుకు భూమిని పరిశీలించినట్లు సీఐ చెప్పారు.