తెలంగాణ

telangana

ETV Bharat / videos

బీఆర్​ఎస్​పై ప్రజల్లో నమ్మకం ఉంది - ఏం జరిగినా మన మంచికే : హరీశ్​రావు - Harish Rao on Group 1 Jobs

By ETV Bharat Telangana Team

Published : Feb 4, 2024, 3:51 PM IST

Updated : Feb 4, 2024, 4:00 PM IST

Harish Rao Fire on Congress Govt Over Group 1 Jobs : రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండి చేయి చూపిస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన మార్పు ఏదైనా ఉందంటే ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్లను రోడ్డున పడేయటం, వృద్ధులకు జనవరి నెలలో పింఛన్​ ఇవ్వకపోవడం అని ఎద్దేవా చేశారు. ఇవాళ పఠాన్​చెరు నియోజవర్గ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందన్న హరీశ్‌రావు, ఏం జరిగినా మన మంచికేనన్నారు. ప్రజల్లో కూడా బీఆర్​ఎస్​పై నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌ దుష్ప్రచారం వల్ల ఓటమి పాలయ్యామన్న మాజీ మంత్రి, హామీల అమల్లో మాత్రం జాప్యం జరిగితే ప్రజల తరఫున పోరాడటంలో ఓడిపోమన్నారు. ఫిబ్రవరి 1న ఇస్తామన్న గ్రూప్‌-1 నోటిఫికేషన్ ఏమయ్యిందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.    

Last Updated : Feb 4, 2024, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details