మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు జీవీఎంసీ నోటీసులు- అనుమతులు లేని నిర్మాణాల నిర్వాకం - GVMC Notice to Gudivada Amarnath
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 12:32 PM IST
GVMC Issues Notice to EX -IT Minister Gudivada Amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనం వివాదాలకు కారణం అవుతుంది. దరఖాస్తు పెండింగ్‌లో ఉండగానే నాలుగు అంతస్తుల భవనం నిర్మించడంపై జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఈ మేరకు మాజీ మంత్రికి నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. భవన నిర్మాణానికి అనుమతులు తీసుకోకపోవడం, మాస్టర్ ప్లాన్ ఉల్లంఘించి నిర్మాణం జరగడాన్ని నోటీసుల్లో ప్రస్తావించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమతులు లేకుండా నిర్మించిన భవనం ఇప్పుడు వివాదాలకు కారణం అవుతుంది. జీవీఎంసీ అందించిన నోటీసులు మాజీ మంత్రి తరఫున వారి ప్రతినిధి అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అక్రమ నిర్మాణాల పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అక్రమంగా నిర్మించిన వైఎస్సార్సీపీ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయి.