తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : గోల్కొండ బోనాల పండుగ - ప్రత్యక్ష ప్రసారం - Golconda Bonalu 2024 LIVE - GOLCONDA BONALU 2024 LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 10:42 AM IST

Updated : Jul 7, 2024, 11:30 AM IST

Golconda Bonalu 2024 : భాగ్యనగరం బోనాల వేడుకలు ప్రారంభయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలిబోనంతో హైదరాబాద్ బోనాలు షురూ అయ్యాయి. ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు జరుగుతాయి. ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకుర్పారణ జరిగింది. గోల్కొండలోని జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం అందుకుంటారు.దశాబ్ది బోనాల వేడుకల పేరుతో, ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. లంగర్‌హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి, చోట బజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనం తీసుకుని, అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పిస్తారు. 
Last Updated : Jul 7, 2024, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details