తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు - రూ.13 లక్షలతో ముస్తాబు - GODDESS DECORATION WITH 13 LAKHS

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2024, 7:11 AM IST

Goddess Decoration With Rs.13 Lakhs In Nizamabad : రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు వైభంగా జరుగుతున్నాయి. భక్తులు తమ స్థాయికి తగ్గట్టు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజుకో అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నిర్వాహకులు సైతం తమ భక్తిని చాటుకునేందుకు అమ్మవారిని నిలిపే మండలాలను భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఏదో ఒక థీమ్​తో మండపాలను ఏర్పాటు చేసి భక్తులకు కనువిందుగా మారుస్తున్నారు.

నిజామాబాద్‌లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని రూ.13 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా సోమవారం లక్ష్మీదేవీ అవతారం అయిన నేపథ్యంలో అమ్మవారిని డబ్బుతో ముస్తాబు చేశారు. అమ్మవారిని చూడటానికి భక్తులు భారీ ఎత్తున వచ్చారు. ప్రతియేటా ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని నిర్వాహకులు తెలిపారు. రూ.50 నుంచి మొదలుకొని రూ.500 నూతన కరెన్సీ నోట్లతో వివిధ రూపాల్లో మలిచి గర్భాలయంతో పాటు దేవాలయంలో అలంకరించారు. దీంతో అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details