మెదక్ జిల్లాలో విషపూరిత మొక్కలు తిని 45 మేకలు మృతి - Medak Goat Dead
Published : Feb 27, 2024, 3:22 PM IST
|Updated : Feb 27, 2024, 3:55 PM IST
Goat Dead In Medak : పశువుల, మేకల కాపరులు అవే జీవానాధారంగా బతుకుంటారు. అవి చనిపోతే సొంత మనుషులు దూరం అయినట్లు బాధ పడుతారు. మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విషపు మొక్కలు తిని 45 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో గత రాత్రి జరిగింది. మెదక్ జిల్లా వల్లాభాపూర్ గ్రామానికి చెందిన బత్తుల సాయిలు రోజు మాదిరిగానే అటవీ ప్రాంతానికి మేకలను మేతకు తీసుకెళ్లాడు. స సాయంత్రం ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికి ఒక్కొక్కటిగా నురగలు కక్కడం గమనించాడు. వెంటనే మేకల కాపరి పశువైద్యాధికారి జీవన్ ప్రతాప్‌ను సంప్రదించగా మందులు సూచించాడు.
మెదక్‌లో మేకలు 45 మృతి : మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 9 గంటల వరకు ఒక్కొక్కటిగా 45 మేకలు చనిపోయాయి. ఒకేసారి 45 మేకలు మృతి చెందడంతో కుంటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మూగజీవాలే జీవానాధరంగా బతుకుతున్నా తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.