కారులో వచ్చాడు - అటూఇటూ చూశాడు - ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఏం చేశాడంటే? - Gas Cylinder theft in secunderabad
Published : Mar 2, 2024, 9:32 AM IST
|Updated : Mar 2, 2024, 1:21 PM IST
Gas Cylinder Theft in Hyderabad : దర్జాగా కారులో వచ్చిన ఓ యువకుడు, రోడ్డుపై పార్క్ చేసిన ట్రాలీ నుంచి గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లిన ఘటన సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయింది. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని సైదాబాద్‌లో చోటుచేసుకుంది. మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన ట్రాలీ సైదాబాద్ మెయిన్ రోడ్డు పక్కన అపి, సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడకు కారులో వచ్చిన యువకుడు ట్రాలీ వద్ద ఎవరూ లేరని నిర్దారణ చేసుకుని, సిలిండర్ తీసుకుని కారులో పారిపోయాడు.
Gas Cylinder Theft : కొద్ది సేపటికి ట్రాలీ వద్దకు చేరుకున్న డ్రైవర్, సిలిండర్ తక్కువ ఉండటం గమనించాడు. అక్కడ ఉన్న వారిని ప్రశ్నించగా, తమకు తెలియదని చెప్పారు. అనుమానంతో సీసీ ఫుటేజ్ పరిశీలించగా, చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.