ఎవడ్రా నువ్వు ఇంతా ట్యాలెంటెడ్గా ఉన్నావు - పిల్లిలా వచ్చి వినాయక లడ్డూ చోరీ - Ganesh Laddu Theft Viral Video - GANESH LADDU THEFT VIRAL VIDEO
Published : Sep 8, 2024, 6:50 PM IST
Ganesh Laddu Theft Viral Video : ఓ దొంగ వినాయకుడి చేతిలో లడ్డూను ఎత్తుకెళ్లిన దృశ్యాలు వైరల్గా మారాయి. స్వామి వారిని ప్రతిష్ఠించిన రోజునే రాత్రి ఎవరు లేని సమయంలో గణేశ్ మండపంలోకి పిల్లిలా ప్రవేశించి లడ్డును తీసుకొని పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్లో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దొంగ చేసిన చోరీ స్పష్టంగా రికార్డు అయ్యింది.
ఇవాళ ఉదయం మండపం నిర్వాహకులు వినాయకుడి చేతిలో లడ్డూ లేకపోవడంతో సీసీ ఫుటేజీని పరిశీలించగా చోరీ జరిగినట్లుగా వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి లడ్డును చోరీ చేసినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఈచోరీ ఘటనపై పలువురు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. దొంగతనానికి ఏమి దొరకనట్లు గణేశ్ లడ్డూను చోరీ చేయాలా? అంటూ మండిపడుతున్నారు. వీడు ఘరానా దొంగలా ఉన్నట్లున్నాడు కంటికి ఏదీ కనిపించినా వదలిలేలా లేడని కామెంట్లు పెడుతున్నారు.