తెలంగాణ

telangana

ETV Bharat / videos

వావ్​! చార్మినార్​లో గణనాథుల శోభాయాత్ర డ్రోన్​ విజువల్స్ - మీరూ ఓ లుక్కేయండి​ ​ - Ganesh Drone Visuals in Charminar - GANESH DRONE VISUALS IN CHARMINAR

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 10:42 PM IST

Ganesh Idols Drone Visuals in Charminar : భాగ్యనగరం గణేశ్‌ నిమజ్జన శోభాయాత్రతో సందడిగా మారింది. భక్తిశ్రద్ధలతో భక్తుల పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. ఇందుకోసం హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరే మహా ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వినాయక శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 

ఆకట్టుకుంటున్న చార్మినార్​లో గణేశ్​ శోభాయాత్ర డ్రోన్​ విజువల్స్ : ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద గణేశ్​ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. పాతబస్తీ నుంచి చార్మినార్ మీదుగా వచ్చిన గణనాథుల శోభాయాత్ర ఇంకా కొనసాగుతోంది. బొజ్జ గణపయ్యలను చివరిసారిగా దర్శించుకునేందుకు భక్తులు సైతం పాతబస్తీకి భారీ సంఖ్యలో తరలివచ్చారు. చార్మినార్ వద్ద కొనసాగుతున్న గణేశ్​ శోభాయాత్ర డ్రోన్ విజువల్స్​ చూపరులను ఎంతో ఆకట్టుకుంటోంది. బొబ్జగణపయ్యల శోభాయాత్రతో చార్మినార్​ పరిసర ప్రాంతమంతా విద్యుత్​దీపాలతో వెలుగుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.   

ABOUT THE AUTHOR

...view details