ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వరద బీభత్సం - అంత్యక్రియలకు తప్పని ఇబ్బందులు - Dead body carried in flood water

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 10:52 PM IST

Funeral of the Dead Body was Carried out in Flood Water : అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వానలు దంచికొట్టాయి. ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టినా పలు ప్రాంతాలు ఇంకా ముంపులోనే చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా నానా అవస్థలు పడాల్సి వస్తోంది. తాాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సేలపాడు గ్రామంలో సీతారావమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంతక్రియలు ఘనంగా నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నా వరద నీరు అడ్డుపడింది. దీంతో చేసేదేమీలేక కుటుంసభ్యులు, గ్రామస్థులంతా మోకాళ్లలోతు ఉన్న వరద నీటిలోనే మృతదేహాన్ని తీసుకెళ్లి అంతక్రియలు నిర్వహించారు.          

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం సృష్టించిన విళయం అంతా ఇంతా కాదు. కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పదుల సంఖ్యలో మృతి చెందారు. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి, లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడి వేల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన వరద వీడక పోవడంతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details