ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే మోదీ గవర్నమెంట్ కుప్పకూలుతుంది - ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి' - Sailajanath Suggestions to govt - SAILAJANATH SUGGESTIONS TO GOVT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 9:37 PM IST

Former Minister Sailajanath Suggestions to Alliance Government : కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలపైనే ఆధారపడి ఉందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ శైలాజనాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహయనిరాకరణ చేస్తే నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలుతుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, నిధులు, ప్రాజెక్టులను సాధించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారనే నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని భారీ మోజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు.

వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని కోరారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలుపై మరింత దృష్టి పెట్టాలన్నారు. జిల్లాకు రావాల్సిన హైకోర్టు బెంచ్, ఐరన్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే వైఎస్సార్సీపీకి కూడా రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ సంఖ్య బలాన్ని ఉపయోగించుకోని రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పార్లమెంటులో గళామెత్తాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details