తెలంగాణ

telangana

ETV Bharat / videos

అబ్దుల్లాపూర్‌మెట్​లో అగ్నిప్రమాదం - సిలిండర్‌, ఫ్రిజ్‌ పేలి భారీగా ఎగిసిపడిన మంటలు - Cylinder blast in Abdullapurmet

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 3:59 PM IST

Fire Accident in Abdullapurmet Today : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రిడ్జ్‌ పేలటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలు సురక్షితంగా బయటపడింది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది  వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్​ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Fire Accident in Nizamabad :  సిలిండర్​ పేలి, ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలు పడిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో జరిగింది. ఓ ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేలుడు దాటికి ఇల్లు పాక్షికంగా ధ్వంసం అయింది. శనివారం వంట గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో, కొత్త సిలిండర్ పెట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details