తెలంగాణ

telangana

ETV Bharat / videos

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం - రూ.5 కోట్లకు పైగా ఆస్తి నష్టం - fire in Yadadri Bhuvanagiri dist

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 4:05 PM IST

Fire Accident in Yadadri Bhuvanagiri District : యాద్రాది భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ వేకువజామున భువనగిరి మండలం హనుమాపూర్‌లోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో పెద్దఎత్తున మంటలు(Fire Accident) చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సబ్‌స్టేషన్‌ సిబ్బంది, వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్న చేశారు. 

Yadadri Bhuvanagiri District News : పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో నిప్పును ఆర్పడానికి చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. కొద్ది సమయం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు. సుమారు రూ.5 కోట్లకు పైన విలువైన విద్యుత్‌ మెటీరియల్‌ కాలి బూడిదైందని తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై వెంటనే స్పందించడంతో ఆస్తి నష్టం కాస్త తగ్గిందని, లేదంటే మరింతగా ఉండేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details