LIVE : ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో బీజేపీ స్వాగత ర్యాలీ - ప్రత్యక్ష ప్రసారం - BJP Office Live - BJP OFFICE LIVE
Published : Jun 20, 2024, 6:05 PM IST
|Updated : Jun 20, 2024, 8:37 PM IST
Live From BJP Office : కేంద్రమంత్రులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో స్వాగత ర్యాలీ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఇరువురు మంత్రులను ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో తీసుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రెండు రోజుల క్రితం బండి సంజయ్ హైదరాబాద్ వచ్చారు. కాసేపటి క్రితం కిషన్ రెడ్డి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. బండి సంజయ్ కరీంనగర్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ఘన సన్మాన కార్యక్రమం జరగనుంది. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంగళవారం తొలిసారి రాష్ట్రానికి వచ్చిన బండి సంజయ్ ను నిన్న పార్టీ కార్యకర్తలు కరీంనగర్లో ఘనంగా సన్మానించారు.
Last Updated : Jun 20, 2024, 8:37 PM IST