తెలంగాణ

telangana

ETV Bharat / videos

ధాన్యం తూకంలో అవకతవకలు - కాంటాలో కిలో తేడా వస్తోందని రైతుల ఆందోళనలు - PADDY PROCUREMENT CHEATING IN TS

By ETV Bharat Telangana Team

Published : May 14, 2024, 1:30 PM IST

Cheating in Weighing Paddy in Kumuram Bheem Asifabad : కుమురం భీం జిల్లా దహేగాం మండలం ఒడ్డుగూడా ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ఓ రైతు తన బరువును ప్రైవేటు తూకంలో చూసుకుని వచ్చాక కేంద్రంలోని తూకంలో మళ్లీ చూడగా కిలో తేడాను గమనించాడు. ధాన్యం బస్తాల బరువు కూడా సరిపోల్చి చూస్తే కిలో తేడా కనిపించడంతో మోసపోతున్నామని గ్రహించిన రైతులు ధర్నాకు దిగారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహిస్తున్న కేంద్రంలో కాంటా, ప్రైవేటు కాంటాలో తూకం వేస్తే రెండింటి మధ్య కిలో తేడా వస్తోందని రైతులు తెలిపారు. ఇప్పటికే 500 బస్తాలు తరలించారని తెలిపారు. బస్తాకు కిలో చొప్పున వేసుకున్నా 500 కిలోల ధాన్యాన్ని తాము మోసపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం మరో రెండు వందల బస్తాలను తీసుకువెళ్లినట్లు చెప్పారు. గత ఏడాది ఇలాగే మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. తూకంలో కోతలకు తెరలేపిన అధికారులపై, ఇలా మోసం చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details