శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మద్యం పట్టివేత - 12మంది అరెస్టు - Liquor Caught in Shamshabad Airport - LIQUOR CAUGHT IN SHAMSHABAD AIRPORT
Published : Sep 5, 2024, 1:13 PM IST
Excise Police Caught Liquor Smuggling Gang From Goa : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న 12 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.12లక్షల విలువై 415మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు భారీగా మద్యం తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో విమానాశ్రయంలో అబ్కారీ అధికారులు అప్రమత్తమయ్యారు.
గోవా నుంచి విమానంలో వచ్చిన వారిని తనిఖీ చేయగా మద్యం తరలిస్తున్న పలువురిని పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి , డీసీ రంగారెడ్డి దశరథ్, ఏసీ ఆర్ కిషన్, ఏఈ ఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్మెంట్ టీములు రెండు, శంషాబాద్ డీటీఎఫ్ ఎక్సైజ్ పోలీస్ టీమ్ కలిసి బృందాలతో కలిసి ఈ రాకెట్ గుట్టు రట్టు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని వెనక ఎవరైనా ఉన్నారా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.