LIVE : కేంద్ర బడ్జెట్‌పై ఈటీవీ భారత్ చర్చా కార్యక్రమం - LIVE DEBATE ON UNION BUDGET 2024
Published : Jul 23, 2024, 10:15 AM IST
|Updated : Jul 23, 2024, 10:56 AM IST
Live Debate on Union Budget Allocation : అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తోన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి సమర్పించిన బడ్జెట్ ఇది. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలోని 3.0 ప్రభుత్వం పూర్తిస్థాయి పద్దును మంగళవారం సమర్పించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో చెరో 20 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటిస్తుందా లేదా, వృద్ధికి ఊతమివ్వడంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తుందా లేదా అనే విషయంపై ఆర్థిక నిపుణుల చర్చా కార్యక్రమం.
Last Updated : Jul 23, 2024, 10:56 AM IST