మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధం : ఈటల - Etela Rajender Yadadri news
Published : Feb 21, 2024, 4:26 PM IST
Etela Rajender In Yadadri : రాబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఈటల కోరారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మీడియా నిర్వహించిన సమావేశంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీజేపీ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 17 పార్లమెంట్ పరిధిలో 5 క్లస్టర్లుగా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో సమూల మార్పులు తీసుకు వచ్చారని ఈటల వెల్లడించారు.
Etela Rajender Fires On Congress : నీతి ఆయోగ్‌తో రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్న ఆయన, రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో మార్పు కోరుకోని కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో అభివృద్ధి పనులు ప్రారంభించిందని విమర్శించారు. ఇది ఆ పార్టీ అహంకారానికి నిదర్శనమన్నారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ తెలిపారు.