హైదరాబాద్‌లో దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం - Kishan Reddy on Epigraphy Museum
Published : Feb 5, 2024, 7:39 PM IST
Epigraphy Museum in Hyderabad : పురాతన శిలా శాసనాలు, చారిత్రాత్మక ఆధారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి సారిగా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నఎపిగ్రఫీ మ్యూజియానికి ఆయన శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎపిగ్రఫీ మ్యూజియంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అందరికి గర్వకారణమని అన్నారు. దేశ చారిత్రాత్మక సంపద పరిక్షణకు బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నామని తెలిపారు. త్వరలో 25 ఎకరాల్లో నాలుగున్నర కోట్ల రూపాయలతో నేషనల్ సైన్స్ సెంటర్ కూడా ప్రారంభించుకోబోతున్నామని మంత్రి చెప్పారు.
Kishan Reddy On Hyderabad Epigraphy Museum : చారిత్రక భాగ్యనగర చరిత్రను అధ్యయనం చేసేందుకు చాలా శాసనాలున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఎక్కడైనా ప్రాచీన శిలలు, శాసనాలుంటే ప్రజలు వాటిని ధ్వంసం చేయకుండా ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. లక్షలాది శిలా శాసనాలకు డిజిటలైజ్ చేసి నేటి తరానికి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎపిగ్రఫిస్టులు రామచంద్ర మూర్తి, రవిశంకర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.