తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాలేరులో వరద బాధితులకు ఈనాడు ఆపన్నహస్తం - Eenadu Donations for Flood Victims - EENADU DONATIONS FOR FLOOD VICTIMS

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 10:50 PM IST

Eenadu Group helps relief victims in Khammam : వరద బాధితులకు ఈనాడు సంస్థ చేయూత అందించింది. పాలేరు నియోజకవర్గంలో ఆకేరు, మున్నేరు, పాలేరు పొంగి ప్రవహించిన నేపథ్యంలో అనేక కుటుంబాలు వరద తాకిడికి గురై కకావికలం అయ్యాయి. గ్రామాలు ఖాళీ చేసి బాధిత కుటుంబాల సభ్యులు కట్టుబట్టలతో పునరావస కేంద్రాలకు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే వాళ్ల ఇళ్లన్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఇళ్లల్లో ధాన్యం, బియ్యం, నిత్యవసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్​ పరికరాలు అన్నీ పనికి రాకుండా పోయాయి.  

వరద ఉద్ధృతికి సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులకు ఈనాడు అండగా నిలిచింది. ముంపునకు గురైన ఖమ్మం గ్రామీణ మండలం కస్నాతండా, కాచిరాజుగూడెం తండా, వాల్యతండా, తిరుమలయపాలెం మండలంలోని అజ్మీరతండా, రాకాసి తండా, కుసుమంచి మండలం నానుతండాల్లో ఈనాడు ఆధ్వర్యంలో కిట్లను పంపిణి చేశారు. ఖమ్మం యూనిట్ ఇన్​ఛార్జ్​ వీరబాబు నేతృత్వంలో సిబ్బంది వ్యానులో సహాయ సామాగ్రిని ఆయా గ్రామాలకు వెళ్లి బాధితులకు అందించారు. కష్టకాలంలో తమను ఆదుకున్న ఈనాడు సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details