రామోజీ రావు స్ఫూర్తితో ముందుకు సాగుతాం - టెక్సాస్‌లో ఘనంగా సంస్మరణ సభ - Ramoji Rao Memorial Meeting in usa - RAMOJI RAO MEMORIAL MEETING IN USA
Published : Jun 18, 2024, 10:12 PM IST
Ramoji Rao Memorial Meeting in Texas USA : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు భారతదేశ జర్నలిజం రంగంలో ధ్రువతారగా ఎప్పటికీ గుర్తుంటారని టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో జరిగిన సంస్మరణ సభలో వక్తలు ప్రశంసించారు. రామోజీరావు ఏ వ్యాపారం చేసినా అందులో సమాజానికి మేలు జరగాలని కోరుకునేవారని రాయపాటి సుబ్రహ్మణ్యం నాయుడు పేర్కొన్నారు. రామోజీరావు క్రమశిక్షణ, అత్యున్నత ప్రమాణాలను పాటించాలనే పట్టుదలను తుమ్మల ఉమాపతి గుర్తు చేసుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీని స్థాపించి తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారని కొనియాడారు. ఇంకా ఈ సభలో పుసులూరి సుమంత్, గూడూరి శ్రీనివాస్,పాతూరి కోటేశ్వరరావు, వేములపల్లి భాను, కొత్త రవి తదితరులు పాల్గొని రామోజీరావుకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇప్పటికే అనేక దేశాల్లోని తెలుగువారు రామోజీరావును తలచుకుంటూ ఆయన పేరు మీద సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు జాతికి ఆయన లేని లేటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రామోజీరావు తెలుగు పత్రికకు కీర్తిని తెచ్చిపెట్టారన్నారు.